ఇండియా అరబ్ ఫారన్ మినిస్టర్స్ మీటింగ్(India Arab Foreign Ministers Meeting-IAFMM)-2026 తొలిసారిగా మన దేశం(న్యూఢిల్లీలో)లో ఈ నెల 31న జరగనుంది. ఇది రెండో సమావేశం. మొదటి భేటీ 2016లో బహ్రెయిన్‌లో జరిగింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత అరబ్ ప్రపంచంతో ఉన్నత స్థాయి దౌత్య సమావేశం మళ్లీ జరగబోతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) గురువారం తెలిపింది. ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహ అధ్యక్షత వహించే ఈ సమావేశానికి సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, అరబ్ స్టేట్స్ లీగ్(League of Arab States-LAS) సభ్య దేశాల సీనియర్ ప్రతినిధులు, అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ హాజరుకానున్నారు. ఈ ఫోరం.. అరబ్ ప్రపంచంతో మన దేశ బహుముఖ సహకారానికి మార్గనిర్దేశం చేయనుంది. అరబ్ లీగ్‌లోని 22 సభ్య దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. విదేశాంగ మంత్రులు, సహాయ మంత్రులు లేదా సీనియర్ అధికారుల స్థాయిలో పాల్గొంటారని భావిస్తున్నారు. భేటీకి క్షేత్ర స్థాయి ఏర్పాట్లు చేయడానికి నాలుగో ఇండియా-అరబ్ సీనియర్ అధికారుల సమావేశం ఒక రోజు ముందుగా జనవరి 30న జరగనుంది.
IAFMM-2026 | ఇండియా అరబ్ ఫారన్ మినిస్టర్స్ మీటింగ్
- Advertisement -
RELATED ARTICLES
