Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిYellampet | ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి

Yellampet | ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి

  • నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి,సిఐ సత్యనారాయణ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. బుధవారం స్థానిక భారత్ బైబిల్ కాలేజీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల దాఖలుకు చేసిన భద్రతా ఏర్పాట్లను, ఇతర సౌకర్యాలను వారు నిశితంగా పర్యవేక్షించారు. అనంతరం ఏసీపీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ..

ఎన్నికల నేప థ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నామినేషన్ల కేంద్రం వద్ద మూడుఅంచెల పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరి గా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించాలను కునే వారు ముందస్తుగా అనుమతి తీసుకోవా లని ఏసీపీ సూచించారు.

- Advertisement -

ఎన్నికల నోటిఫికేషన్ నిబంధనలను అతిక్రమించినా లేదా నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరించినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పారదర్శకంగా ఎన్నికలు నిర్వ హించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారులు పాల్గొ న్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News