Homeరంగారెడ్డిAbdullapur Village | మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం ఘనంగా నిర్వహణ

Abdullapur Village | మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం ఘనంగా నిర్వహణ

అబ్దుల్లాపూర్ మెట్టు: అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో(Abdullapur Village) ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచన మేరకు దీపావళి పండుగ సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’(Maa Indiramma Intlo Diwali) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో దీపావళి వేడుకలు నిర్వహించి, వారితో కలిసి పండుగ సంబరాల్లో గ్రామ సర్పంచ్ మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విజయ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి తుల్జా ప్రసాద్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News