Tuesday, February 10, 2026
Homeనల్లగొండNominations | మోత్కూరు లో తొలిరోజు 3 నామినేషన్ దాఖలు

Nominations | మోత్కూరు లో తొలిరోజు 3 నామినేషన్ దాఖలు

  • నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మోత్కూరు మున్సిపాలిటీలో రెండవ సాధారణ ఎన్నికల నామినేషన్ కు తొలి రోజు బుధవారం ముగ్గురు 3,4,12 వార్డులకు గాను ఒక్కో నామినేషన్ దాఖలు చేశారని మున్సిపల్ కమిషనర్ కే.సతీష్ కుమార్ తెలిపారు.3వ వార్డు సుల్తాన్ మనోజ్ కుమార్,4వ వార్డు కస్తూరి జ్యోతి,12వ వార్డు లకు మెంట రమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.నామినేషన్ స్వీకరణ ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గం.ల వరకు కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ సిహెచ్.హనుమంతరావు సందర్శించారు.ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నామినేషన్ స్వీకరణ జరగాలని కమిషనర్ కే.సతీష్ కుమార్ కు సూచించారు.నామినేషన్ కౌంటర్లు,హెల్ప్ డెస్క్,భద్రత,మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ మోత్కూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా అందులో 7106 మంది పురుషులు,7277 మంది మహిళలు మొత్తం 14,383 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

26 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, ఎన్నికల కోసం ఆర్వోలు ఐదుగురు,ఏఆర్వోలు ఐదుగురు, ఒక ఎంసీసీ టీం,ఎఫ్ఎస్టీ ఒక టీం, ఎస్ఎన్టీ ఒక టీం,పీవోలు, ఏపీవోలు,ఏపీవోలు 156 మంది విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ పర్యవేక్షణలో ఏఎస్ఐ,8 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోతి,ఎన్నికల ప్రత్యేక అధికారి సురేష్,మేనేజర్ ప్రభాకర్, సిఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News