Homeనల్లగొండYadagirigutta | యాదగిరికొండపై ఏం జరుగుతోంది?

Yadagirigutta | యాదగిరికొండపై ఏం జరుగుతోంది?

  • తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టకు ఈవో ఎక్కడ?
  • పట్టించుకోని దేవాదాయ శాఖ, అధికారుల ఇష్టారాజ్యం,అందుకే డాలర్లు మాయం.
  • ఆడిట్లో బయటపడిన అధికారుల నిర్లక్ష్యం.

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారి దేవస్థానంలో ఏం జరుగుతోంది ? మొన్నటికీమన్న చింతపండు దొంగతనం విషయమై రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అది మరువకముందే మరో మారు యాదాద్రి దేవస్థానంలో అధికారుల ఆధీనంలో ఉన్న డాలర్లు మాయమయ్యాయి.ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 10 లక్షల రూపాయల విలువచేసే వెండి బంగారు స్వామివారి డాలర్లు మాయమయ్యాయి.అధికారుల నిర్లక్ష్యం వల్లనే డాలర్లు మాయమయ్యాయని, పెద్ద చర్చ జరుగుతోంది.

Gold and Silver Dollars Missing at Yadagirigutta Temple1

దీనికంతటికి కారణం ఇప్పటివరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవోను నియమించకపోవడం అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈవో లేకుండా కొండ పైన ఉన్న అధికారులే తిష్ట వేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి కేవలం డాలర్లు మాత్రమే మాయమయ్యాయని వినిపిస్తుంది, కానీ గతంలో పనిచేసిన ఆలయ ఈఓ వెంకటరావు వెళ్లి దాదాపు 28 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈవో లేనందున దేవస్థానంలో ఇంకా ఏమేమి మాయమయ్యాయి అని సందేహ పడుతున్నారు భక్తులు.

- Advertisement -

యాదాద్రి దేవస్థానానికి సంబంధించిన స్వామివారి ఆదాయం పక్కదోవ పడుతూ ఉంటే, యాదాద్రి దేవస్థానం కొంతమంది కనుసైగల్లో నడుస్తూ ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వమని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఆదాయం పైన ఉన్న దృష్టి స్వామి వారికి సంబంధించిన విలువైన వస్తువులు మాయమవుతున్నప్పుడు ఎందుకు దృష్టి పెట్టడం లేదని, భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

Gold and Silver Dollars Missing at Yadagirigutta Temple

దీనికి కారణం కొండపైన కొన్ని సంవత్సరాల నుంచి అధికారులు ఎలాంటి ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉండటంవల్ల ఇలాంటివి కూడా జరుగుతున్నాయని అంటున్నారు. అందుకే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ యాదాద్రి దేవస్థానం పైన ప్రత్యేక దృష్టి సారించి అధికారులను బదిలీ చేయించి స్వామివారి ఆదాయాన్ని రక్షించి, మాయమైన డాలర్ల పై విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని భక్తులు స్థానికులు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News