అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 22(ఆదాబ్ హైదరాబాద్): బాటసింగారం గ్రామ పంచాయతీలోని నేతాజీ విగ్రహం వద్ద గల మైదానంలో సీఎం కప్ క్రీడా పోటీలను(CM Cup Sports Competitions) సర్పంచ్(Sarpanch) ఎర్రవెల్లి గౌరీశంకర్(Erravelli Gourishankar) ఘనంగా ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులతో పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం.. అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, ఫుట్‌బాల్, యోగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌరీశంకర్ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. గ్రామంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 102 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారికి ప్రశంసా పత్రాలను, బహుమతులను అందజేశారు(Gifts Distribution).
ఈ నెల 29న జరిగే మండల స్థాయి పోటీలకు ఎంపికైనవారు మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనకబడిన బాలుర గురుకుల పాఠశాలలో హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నార్ల కొండ వెంకటేష్, ప్రధానోపాధ్యాయుడు దాసరి ప్రతాప్, ఫిజికల్ డైరెక్టర్ సోలా పోగుల స్వాములు, గడ్డం రమేష్, ఎండీ పాషా, మోడపు వినోద్ కుమార్, మొడెపు శ్యామలకృష్ణ, నేరేడు క్రాంతికుమార్, సీతయ్య చారి, కొడిసెల నెహ్రూ, చెంచల మమతా సంజీవ, శ్రీశైలం, నేతాజీ యువజన సంఘం ప్రెసిడెంట్ కొండోజు హరిప్రసాద్, మాజీ ప్రెసిడెంట్ మోడపు గణేష్ పాల్గొన్నారు.
