బంగారం, వెండి రేట్లు రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త రికార్డుల(New Records)ను నెలకొల్పుతున్నాయి. పసిడి ధర ఇవాళ ఒక్క రోజే రూ.9 వేలు పెరిగింది. వెండి రేటు ఈ రోజు ఏకంగా 14 వేలు పెరగటం గమనార్హం. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,52,800గా నమోదు కాగా ఈ రోజు ఉదయం రూ.1.61 లక్షలు పలకటం విశేషం. 22 క్యారెట్ల రేటు రూ.1,41,900కి చేరింది. కిలో వెండి ధర ఇవాళ రూ.3,30,000గా చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్(Global Markets)లో రేట్లు భారీగా పెరగటమే దీనికి కారణం. అంతర్జాతీయ(International) రాజకీయ(Political), భౌగోళిక ఉద్రిక్తతలు(Geographical Tensions) ఈ పరిస్థితికి దారితీశాయి. పెట్టుబడిదారులు ఈ లోహాల(Metals)ను సురక్షిత మదుపు సాధనం(Safe Investment Tool)గా భావిస్తున్నారు.
- Advertisement -
