HomeఫోటోలుDacoit Movie | మృణాల్ ఠాకూర్ పోర్షన్ షూటింగ్ పూర్తి

Dacoit Movie | మృణాల్ ఠాకూర్ పోర్షన్ షూటింగ్ పూర్తి

అడివి శేష్(Adivi Sesh) కొత్త సినిమా(New Movie).. డెకాయిట్. షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) కథానాయిక(Heroine). ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ.. షూటింగ్ చివరి దశలో ఉంది. మృణాల్ ఠాకూర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు.

decoit movie2

ఒక భారీ షెడ్యూల్‌లో తన పార్ట్ ఫినిష్ చేశారు. చిత్ర బృందం ఆమెకు ఘనంగా సెండాఫ్ ఇచ్చింది. విడుదలకు ముందు అన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్‌(Promotional Activities)లో భాగమవుతారు. తెలుగు, హిందీలో డబ్బింగ్ కూడా చెబుతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో(Bheem’s Cicerolio) మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -
decoit movie3

నేపథ్య సంగీతాన్ని జ్ఞాని ఇస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News