పారిశుధ్య పనుల్లో కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని శానిటేషన్ వస్తువులను అందించడం జరిగిందని మాజీ వార్డు సభ్యుడు కోలా వెంకటేష్ అన్నారు.సోమవారం పూడూరు-కిష్టాపూర్ డివిజన్ వార్డు పరిధి పూడూరులోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి శుభం సేఫ్టీ కంపెనీ ఆధ్వర్యంలో షూస్ లు,ఆఫ్రాన్,గ్లౌజులు,మాస్క్ లు,అద్దాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారికి శానిటేషన్ ఆస్తులు పంపిణీ చేసిన శుభం సేఫ్టీ కంపెనీ యాజమాన్యానికి పలువురు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కోలా వెంకటేష్,నిమ్మల కృష్ణ,శేఖర్ రెడ్డి,తుపాకుల కృష్ణ,నాయకులు కటకం లక్ష్మణ్,జీ.అనంత్ రెడ్డి,కుమార్ యాదవ్,డప్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Sanitation | జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ వస్తువులు పంపిణీ
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
