అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బండ రావిరాల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగులో ఉన్న వాటర్ ఫిల్టర్ సమస్యను పరిష్కరించి,ఆదివారం గ్రామ ప్రజలకు అందించిన గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్. పాలకవర్గం కృషితో నూతన వాటర్ ఫిల్టర్ ఎర్పాటు చేసారు. దాదపు 3 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన వాటర్ ఫిల్టర్ ధాత ధంటపల్లి శ్రీదర్ రెడ్డి, సహాయ, సహకారాలు అందించిన డైనో వరల్డ్ ఆధినేత ప్రశాంత్ రెడ్డి తో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన వాటర్ ఫిల్టర్‌ను ప్రారంభించారు.

ఈ సంధర్బంగా సర్పంచ్ విజయ్ కుమార్ మట్లాడుతూ ఫిల్టర్ వాటర్ కోసం గ్రామ ప్రజలు చిన్నరావిరాల, గువ్వలేటి మరియు ఇతర స్థలాలకి వెల్లి తెచ్చుకోవడం చూసి ఇబ్బంది కలిగించిందన్నారు. అలాగె పాత వాటర్ ఫిల్టర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉండడం వల్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని, ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించి గ్రామ ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని దాతల సహకారంతో ఈ వాటర్ ఫిల్టర్ ను పాఠశాల ఆవరణ బయట ఎర్పాటు చేశామన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఈ వాటర్ ఫిల్టర్ ను గ్రామ ప్రజలందరు వినియోగించుకోవాలని కోరారు.అధికారంలోకి వచ్చి నెలరోజులు తిరగకముందే సమస్యలను పరిష్కరిస్తుండడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్, వార్డు సభ్యులు నేమురగోముల మహేశ్, కన్నె భరత్ యాదవ్, ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనూష-ప్రవీణ్ , గుండ్ల భవాని-శివ ముదిరాజ్ , కారోబార్ ఏర్పుల శ్రీశైలం, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
