- రద్దీని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు..
- ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..
- స్పెషల్ ఆపరేషన్స్‌పై సమన్వయ సమావేశం..
- వివరాలు తెలిపిన ఆర్.ఆర్.రీజనల్ మేనేజర్ శ్రీలత
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీ, తెలంగాణ జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక బస్సులను నడుపుతామని అన్నారు. ఈ మేరకు స్పెషల్ ఆపరేషన్స్‌పై మహాత్మాగాంధీ బస్టాండ్‌లో పోలీస్, ట్రాఫిక్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. బస్సులపై వారికి సూచనలు చేశారు.ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. రాయలసీమ వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్.. ఉత్తర తెలంగాణకు జేబీఎస్.. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలియజేశారు.. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.
- Advertisement -
