- రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి
కరీంనగర్ రూరల్ పోలీసులు తీగలగుట్టపల్లి గ్రామంలోని అపోలో రీచ్ హాస్పిటల్ వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఆవుదరి చంద్రశేఖర్ తండ్రి మొండయ్య అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుకను తన ట్రాక్టర్ నందు కరీంనగర్ వైపుగా తరలిస్తుండగా తీగలగుట్టపల్లి గ్రామంలోని అపోలో రీచ్ హాస్పిటల్ వద్ద కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు నిందితుడి పై కేసు నమోదు చేసి అట్టి ట్రాక్టర్ ను సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపించామని ఇటీవల అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన ర్యాకం వెంకటేష్ మల్లెపోగు మధు లను కరీంనగర్ రూరల్ ఏం ఆర్ ఓ ముందు లక్ష రూపాయల పూచీకతు పై బైండోవర్ చేసినట్లు రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
