మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర కమీషనర్ కార్యాలయం కోఠి వద్ద ధర్నాకి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న కీసర, అల్వాల్, జవహర్నగర్, షామీర్పేట్, మేడ్చల్, దిండిగల్, సూరారం, బాలనగర్, మల్కాజిగిరి ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 100 ఆశా వర్కర్లను అరెస్టు చేసి ధర్నాకి రాకుండా అడ్డుపడ్డారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సిఐటియు ఉన్ని కృష్ణన్ అన్నారు. ఈ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. ఆశా వర్కర్లకు ఇప్పటికే సర్వే చేసిన డబ్బులు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -
