నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజ్‌లో ఏర్పాటు
సర్దార్ పటేల్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం
వాజ్‌పేయి స్మారక ఉపన్యాసం, పరిశోధనల అవార్డుల ప్రదానోత్సవం
ముఖ్య అతిథులుగా హాజరుకానున్న వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ తదితరులు
స్టూడెంట్స్, స్కాలర్స్, ప్రొఫెసర్స్, ఇంటలెక్చువల్స్ మొత్తం దాదాపు వెయ్యి మంది పాల్గొనే అవకాశం
త్రినేత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్ నూనె వెల్లడి
వాజ్‌పేయిని చూసి స్ఫూర్తి పొందిన ప్రతిఒక్కరూ హాజరుకావాలని విజ్ఞప్తి
మాజీ ప్రధాని(Former Prime Minister), భారతరత్న (Bharataratna) అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) శతజయంతి కార్యక్రమం (Birth Centenary Programme) ఈ నెల 23న మంగళవారం నారాయణగూడ(హైదరాబాద్)లోని కేశవ్ మెమోరియల్ కాలేజ్‌లో జరగనుంది. కాలేజీలోని సర్దార్ పటేల్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఈ సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ్‌చందర్ రావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. త్రినేత్ర ఫౌండేషన్ (Treenetra Foundation) ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ (Union Ministry of Culture) సహకారంతో ఈ మీటింగ్ ఏర్పాటుచేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్ నూనె (Balraj Nune) తెలిపారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు.

‘కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గతేడాది ప్రారంభించిన వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాలు ఈ నెలలో ముగుస్తున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణకు త్రినేత్ర ఫౌండేషన్ తరఫున దరఖాస్తు చేసుకుంటే అనుమతి వచ్చింది. వాజ్‌పేయి కార్యక్రమాన్ని నిర్వహించటం అదృష్టంగా భావిస్తున్నాను. వాజ్‌పేయి ఒకే ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది. నోటు కాంగ్రెస్ దగ్గర తీసుకోండి. కానీ.. ఓటు మాత్రం బీజేపీకే వేయండి అని వాజ్‌పేయి ఇచ్చిన పిలుపు అద్భుతం. అందుకే ఆయన గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. ఆ ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు ఆన్‌లైన్ రీసెర్చ్ కాంపిటీషన్ నిర్వహించాం. ఇందులో చాలా యూనివర్సిటీలు పాల్గొన్నాయి. మొదట 54 రీసెర్చ్ పేపర్లను సెలెక్ట్ చేశాం. అందులో నుంచి మళ్లీ 15 పరిశోధన పత్రాలను తీసుకొని 15 సబ్జెక్టులతో ఒక పుస్తకంగా రూపొందించాం.

ఆ బుక్‌ను కూడా 23వ తారీఖు నాటి కార్యక్రమంలో ఆవిష్కరిస్తాం. వాజ్‌పేయి స్మారక ఉపన్యాసంతోపాటు పరిశోధన అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ అవార్డులకు సౌత్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. అందులో ఒకరు.. మేరీ. మరొక వ్యక్తి ఒక లా కాలేజీ ప్రిన్సిపల్. మూడో వ్వక్తి.. శ్రీనివాస్. ఓయూ స్టూడెంట్. వీరికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి ఇస్తాం. ఈ కార్యక్రమంలో మొత్తం దాదాపు వెయ్యి మంది పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో స్టూడెంట్స్, స్కాలర్స్, ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్, జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ తదితరులు ఉన్నారు. నేను పుట్టిపెరిగింది తెలంగాణలో కాబట్టి ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తున్నాను. కాబట్టి.. నా మాదిరిగానే.. వాజ్‌పేయిని చూసి స్ఫూర్తి పొందిన, వాజ్‌పేయిని రోల్ మోడల్‌గా భావిస్తున్న ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను. మీడియా మిత్రులు కూడా సహకరించాలని విజ్ఞప్తి’ అని బాల్‌రాజ్ నూనె అన్నారు.
