ఫెర్టిలిటీపై అవగాహన పెంపునకు మరో ముందడుగు
ఉచిత కన్సల్టేషన్లు, ఫెర్టిలిటీ పరీక్షలు, శాస్త్రాధారిత మార్గదర్శకాన్ని నేరుగా ప్రజలకు అందించే దేశవ్యాప్త ఉద్యమం
కరీంనగర్, డిసెంబర్ 17: ఇండియాలో అత్యంత విశ్వసనీయ రీప్రొడక్టివ్ మెడిసిన్ సంస్థ(Reproductive Medicine Institute)ల్లో ఒకటైన ఒయాసిస్ ఫెర్టిలిటీ (Oasis Fertility).. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంపు లక్ష్యంతో చేపట్టిన జనని యాత్ర(Janani Yathra) వేములవాడ(Vemulawada)కు చేరుకుంది. టయర్-I, II, III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఎంఎల్ఏ(Peddapalli Mla) చింతకుంట విజయ రమణారావు (Chinthakuna Vijayaramanarao), వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, వేములవాడ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొమరయ్య, కరీంనగర్ కేఓజీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మలత, కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ వస్తాద్ కృష్ణ, దైత కుమార్, విద్యా సాగర్ హాజరయ్యారు. ఫెర్టిలిటీ అవగాహనను కుటుంబాలకు దగ్గర చేస్తూ సమాజ స్థాయి ఆరోగ్య చైతన్యాన్ని బలోపేతం చేస్తున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రయత్నాలను అభినందించారు.
జీవనశైలి మార్పులు, ఆలస్య వివాహాలు, శాస్త్రీయ అవగాహన లోపం వంటి కారణాలతో ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఒయాసిస్ జనని యాత్ర.. దంపతులకు ఉచితంగా ఫెర్టిలిటీ సంప్రదింపులు, ఏఎంహెచ్ పరీక్ష, వీర్య పరీక్ష, హీమోగ్లోబిన్ పరీక్షలు వంటి సేవలను అందిస్తోంది. శుభ్రమైన, సురక్షితమైన నమూనా సేకరణ ప్రాంతాలతో ఈ సేవలు మరింత సౌకర్యవంతంగా అందుతాయి. వేములవాడ తర్వాత ఈ జనని యాత్ర.. పెద్దపల్లి, గుంతకల్లు, ఎమ్మిగనూరు ప్రాంతాలకు వెళ్లి మరిన్ని సముదాయాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంఎల్ఏ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ శాస్త్రీయ సమాచారం సమాజానికి చేరితే కుటుంబాలు శక్తిమంతమవుతాయని చెప్పారు. భయాలు, అపోహలు తొలిగిపోతాయని, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని అన్నారు. నిపుణులను కుటుంబాలకు చేరువ చేసి వారికి అవగాహనతో శక్తినిస్తున్న ఒయాసిస్ ఫెర్టిలిటీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్ & కో-ఫౌండర్ డాక్టర్ దుర్గా జి.రావు మాట్లాడుతూ.. సైన్స్.. ఫెర్టిలిటీ రంగాన్ని మారుస్తున్న ఈ సమయంలో ఒయాసిస్ జనని యాత్ర ఆధునిక, సాక్ష్యాధారిత ఫెర్టిలిటీ గురించిన సమాచారాన్ని సమాజాల మధ్యకు నేరుగా తీసుకెళ్తోందని చెప్పారు. ఫెర్టిలిటీ యాత్రను ప్రారంభిస్తున్న దంపతులకు తొందరగా వైద్య మార్గదర్శకాన్ని అందించడం ద్వారా భవిష్యత్తుకు ఆరోగ్యకరమైన మార్గం సృష్టిస్తుందని తెలిపారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ సీఈఓ పుష్కరాజ్ షెనాయ్ మాట్లాడుతూ.. దేశంలో ఫెర్టిలిటీ రేటు నిరంతరం పడిపోతున్న ఈ సమయంలో సమయానుకూలమైన, అందుబాటులో ఉన్న ఫెర్టిలిటీ సంరక్షణ మరింత ముఖ్యమైందని చెప్పారు. నిపుణుల కన్సల్టేషన్, డయగ్నస్టిక్స్, అవసరమైన మార్గదర్శకంతో ‘గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్’ను గ్రామీణ స్థాయికి విస్తరిస్తున్నామని వెల్లడించారు. ప్రతి జంట సరైన నిర్ణయాలు తీసుకునేలా సకాలంలో సహాయం అందించడం తమ ధ్యేయమని పేర్కొన్నారు.
క్లినికల్ హెడ్ & ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జిగ్నా తమగోంద్ మాట్లాడు.. మునుపటి జనని యాత్రకు వచ్చిన అపార స్పందన దంపతులు సరైన మార్గదర్శకాన్ని ఎంత విలువగా తీసుకుంటారో చూపించిందని గుర్తుచేశారు. ఫెర్టిలిటీపై అవగాహన తక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో సరైన సమాచారం, సానుభూతితో కూడిన సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఒయాసిస్ ఫర్టిలిటీ గురించి:
2009లో స్థాపించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ.. దేశవ్యాప్తంగా 34 కేంద్రాలతో అగ్రగామి రీప్రొడక్టివ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా నిలిచింది. శాస్త్రీయ నైపుణ్యం, నైతిక వైద్య పద్ధతులు, అత్యున్నత IVF విజయ శాతాలతో ప్రసిద్ధి చెందిన ఒయాసిస్.. ఇన్నాళ్లుగా అనేక కుటుంబాలకు ఆరోగ్యకరమైన బిడ్డలను అందించింది. పురుషులు, మహిళల కోసం IVF IUI, ICSI, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ వంటి విస్తృత సేవలను ఆధునిక ల్యాబ్ టెక్నాలజీ, వ్యక్తిగత సంరక్షణ, సంపూర్ణ వెల్‌నెస్ సహకారంతో అందిస్తోంది.
