Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | ఇంటిపేరు ఎద్దు.. చేసే అక్రమాలకు లేదు హద్దు..

Corruption | ఇంటిపేరు ఎద్దు.. చేసే అక్రమాలకు లేదు హద్దు..

  • కేవలం మాజీ సర్పంచ్.. కానీ కోట్లలో సంపద
  • ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి ఊడిగం
  • పార్టీల కండువాలు కప్పుకుని లెక్కలేని దోపిడీలు
  • అప్పుడు బీఆర్ఎస్లో ఇప్పుడు కాంగ్రెస్లో
  • పార్టీ ఏదైనా మనోడి స్టైల్ ఒక్కటే.. దోచుకోవడం
  • ఎంత చెప్పుకున్నా తరగని అక్రమ కథనాలు
  • తూముకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ చరిత్ర

ఆయనో మాజీ సర్పంచ్.. అయితేనేం.. అతగాడు తలచుకుంటే ఏమైనా చేయగలడు.. కండువాలు మార్చేసినట్లు పార్టీలు మార్చేస్తాడు.. నాయకులను బుట్ట లో వేసుకుంటాడు.. అలాగే ప్రభుత్వాధికారులను కొనేస్తాడు.. లెక్కలేని అక్రమాలు చేసేస్తాడు.. లక్షలు కొల్లగొడతాడు.. అతనికి అడ్డు అనేది లేదంటే అతిశ యోక్తి కాదు.. అతని పేరు ఎద్దు నగేష్.. అతగాడు చేసే అక్రమాలకు అసలు ఉండదు హద్దు.. మల్లారెడ్డి భూములు కబ్జా పెట్టిండు.. నేను అక్రమాలు చేస్తే తప్పేముంది అనుకుంటాడు.. బీఆర్ఎస్ పార్టీ అధికా రంలో ఉన్నప్పుడు ఇతగాడు సర్పంచ్గా పదవి బాధ్య తలు చేపట్టాడు.. మరెక్కడో కాదు మన ప్రియతమ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి నియోజక వర్గం, శామీర్పేట్ మండలం, తూముకుంట గ్రామ పంచా యతీ.. అది నేడు జీ. హెచ్.ఎం.సి.లో కలిసి పోయింది.. ఈ తరుణంలో ఇతగాడి కహానీ చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. పచ్చి నిజాలు వెలుగు చూస్తాయి..

Allegations Mount Against Thumkunta Former Sarpanch Eddu Nagesh 0

2014 నుంచి 2018 వరకు మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ మండల్, తూముకుంట గ్రామ పంచాయతి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన ఎద్దు నాగేష్.. ఓ కార్యదర్శిని అడ్డం పెట్టుకొని నకిలీ ఇంటి అనుమతులు ఇప్పించేవాడు.. ఫేక్ స్టాంప్ లు వేసి మరీ ఈ దందా నడిపిస్తూ లక్షల రూపాయిలు సొమ్ము చేసుకున్నాడు అన్నది జగమెరిగిన సత్యం.. అంతే కాకుండా గ్రామ పంచాయతీలో స్టీల్ట్ ప్లస్ వన్ అంటే ఒక్క ఫ్లోర్ కు అనుమతి ఉంటే.. అదనపుగా మరో మూడు అంతస్తులు నకిలీ పర్మిషన్ ఇప్పించేవాడు.. ఇలా ప్రతి దానికి ఒక్క రేటు ఫిక్స్ చేసి.. కోట్ల రూపాయిలకు అధిపతయ్యాడు.. ఇక ఇతగాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపాటికి జిందాబాద్ లు, జేజేలు కొట్టి తాను చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు పూటకో వేషం వేస్తూ పొద్దు గడుపుతూ ఉండేవాడు..

- Advertisement -
Allegations Mount Against Thumkunta Former Sarpanch Eddu Nagesh 2

ఇలాంటి మాయలోడి భాగోతం నేడు బట్టబయలైంది.. అసలా కథా కమామీషు ఒకసారి చూద్దాం.. బోధన్ జిల్లా, కజీపూర్ కు చెందిన సునీత అనే మహిళ తుంకుంట గ్రామానికి వచ్చి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నివాసం ఉంటోంది.. ఇటీవలే తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోతే, బోధన్ కజీపూర్ కు వెళ్లి అక్కడే రెండు నెలలు ఉంది.. అనంతరం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత.. తూముకుంటలో ఉన్న తన నివాసానికి వచ్చి చూడగా.. స్థానికంగా ఉండే మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ అనే వ్యక్తి తన ఇంటి తాళాలు పగలగొట్టి, ఇంట్లో ఉన్న సామాను ఎత్తుకెళ్లి మరో మహిళను తీసుకువచ్చి ఆ ఇంట్లో పెట్టాడని పోలీ సులకు ఫిర్యాదు చేసింది బాధితురాలైన సునీత.. దీంతో విషయం తెలుసుకున్న పోలీసుల మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ పై కేసు నమోదు చేశారు..

Allegations Mount Against Thumkunta Former Sarpanch Eddu Nagesh

ఇంతటి నీచపు వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలో ఎలా కొనసాగిస్తుంది..? ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీకి నష్టం జరుగుతుందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.. ప్రస్తుతం పార్టీపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే ఇలాంటి దుర్మార్గాలకు, దుస్సాహసాలకు పాల్పడితే.. ఇలాంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ.. వారు డిమాండ్ చేస్తున్నారు.. పైగా ఇతగాడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఎద్దు నగేష్ లాంటి వ్యక్తులను క్షమించరాదని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఒకసారి ఇతని గురించి ఆలోచన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News