Homeఆదాబ్ ప్రత్యేకంAadab Effect | వాస్తవాల ఆధారంగా న్యాయం చేస్తాం!

Aadab Effect | వాస్తవాల ఆధారంగా న్యాయం చేస్తాం!

  • మారేడ్పల్లి భూవివాదంపై స్పందించిన జిల్లా సర్వే అధికారి..
  • కోర్టు ఆదేశాల మేరకు రికార్డులను పునఃపరిశీలించి సర్వే చేస్తాం..

‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ తెలుగు దినపత్రికలో సోమవారం (డిసెంబర్‌ 15, 2025) నాడు ప్రచురితమైన ‘‘కోర్టు తీర్పును కాలరాసిన అధికా రులు’’ అనే శీర్షికతో కూడిన వార్తా కథనంపై సర్వే, సెటిల్‌ మెంట్స్‌ మరియు ల్యాండ్‌ రికార్డ్స్‌, హైదరాబాద్‌ జిల్లా సర్వే అధికారి శ్రీరామ్‌ స్పందించారు. మారేడ్‌పల్లి సర్వే నంబర్‌ 74 భూవివాదం, అధికారుల పక్షపాత చర్యలు, హైకోర్టు ఉత్తర్వుల ధిక్కారంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

Marredpally Survey No.74 Dispute District Survey Officer Assures Justice

రికార్డులు పరిశీలించి, వాస్తవాల ఆధారంగా సర్వే

సర్వే నంబర్‌ 74కు సంబంధించి సబ్‌ డివిజన్‌ సర్వే వివాదంపై జిల్లా సర్వే అధికారి శ్రీరామ్‌ స్పందిస్తూ… కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, రికార్డులను పునఃపరిశీలించిన అనంతరం వాస్తవాల ఆధారంగా సర్వే చేపడతామని, తద్వారా బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈవిషయంలో న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి పార దర్శకంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. ‘కోర్టు తీర్పును కాల రాశారు’ అంటూ వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, వివాదానికి ఒక పరి ష్కారం చూపడానికి కృషిచేస్తామనిఆయన పేర్కొన్నారు.

- Advertisement -

మారేడ్‌పల్లి సర్వే నంబర్‌ 74 భూవివాదంపై జిల్లా సర్వే అధికారి ఇచ్చిన ఈ హామీ, న్యాయం కోసం పోరాడు తున్న పట్టాదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశంగా ఉంది. వాస్తవానికి న్యాయం దక్కే వరకు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ఈ విషయాన్ని పరిశీలిస్తూనే ఉంటుంది. మా అక్షరం అవినీతిపై అస్త్రం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News