దుందుభి వాగు ప్రాంతంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా 20 30 టిప్పర్లలో ఇసుక దొంగ దారి గ్రామాలంతా ధూళి ప్రజలు ఆవేదన రాత్రిపూట టిప్పర్లు-ప్రభుత్వ ఇసుక ప్రివేట్ వ్యక్తులకు
నిబంధనల్ని అక్రమంగా మిగిల్చి ఇసుక రవాణా:
కల్వకుర్తి మండల కేంద్రంలో దుందుభి వాగులో రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్లతో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ప్రభుత్వం అనుమతించిన పనికి నిలువుటద్దం పెట్టి , కొంతమంది టిప్పర్ యజమానులు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసి, అనుమతుల బోర్డుల్ని సృష్టించుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డంపు చేస్తున్నారు.

స్థానికులు, రైతులు టిప్పర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5గం” వరకు భారీ శబ్ధాలతో 20-30 టిప్పర్లతో తెగ ఇసుక రవాణా చేస్తున్నారని, రోడ్లు గుంతల మయం అయ్యాయని, వారు బయటకి వెళ్లాలనుకుంటే భయపడుతున్నాం అంటున్నారు రైతన్నలు,ఇక మరో కోణంలో, దుందుభి వాగు చుట్టుపక్కల గ్రామాల్లో జీవనవైఖరి ప్రభావితమై, ఇంటి బట్టలు, వస్తువులు లతోపాటు ప్రతీదానికీ ధూళి దుమ్ము వెళ్తుంది అంటూ వాపోతున్నారు రైతులు, స్థానికుల అవేదనతో ప్రజా ప్రతినిధులు పోలీసు, మైనింగ్ అధికారుల నుంచి చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నారు. అధికారులు తప్పనిసరిగా టిప్పర్ యజమానులపై, అక్రమ ఇసుక రవాణా నిర్వర్తించిన వారికి శాశ్వత అనుమతులు రద్దు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

టిప్పర్లు రాత్రి-పగలు సౌండ్ లతో విజృంభిస్తున్నాయి సమయపాలన, అడ్డు అదుపు లేకుండా కొన్నాళ్లుగా అనుమతులను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయడం, ప్రభుత్వ పరంగా అక్రమ లాభసంపాదన సంభవించినట్లు ఆరోపణలు. రోడ్డు దెబ్బతినడం, ప్రమాదాల ప్రమాదకర పరిస్థితులు, ప్రజల భద్రత లేమి. లేకపోవడం, స్థానికులు, రైతులు, ప్రజాప్రతినిధులను కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

