Tuesday, February 10, 2026
HomeతెలంగాణCold Wave | తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Cold Wave | తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

  • ఉత్తరాది నుంచి శీతలగాలుల తాకిడి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

తెలంగాణ వ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావ రణ శాఖ అధికారి తెలిపారు. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. రెండ్రోజుల పాటు శీతల, అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. ఎల్లుండి నుంచి పొగ మంచు పెరిగే అవకాశం ఉందన్నారు. శీతల గాలులు, పొగ మంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం వివరించింది. పొగ మంచు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. శీతల గాలులతోపాటు పొగ మంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది.

- Advertisement -

దాంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. శనివారం.. ఆదిలాబాద్‌, కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 14వ తేదీ.. ఆదివారం.. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో చూస్తే రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల గాలులు ఉత్తర ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News