Homeరంగారెడ్డిCoach | అఖిల భారత జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు కోచ్‌గా ఎంపిక

Coach | అఖిల భారత జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు కోచ్‌గా ఎంపిక

  • డా. సోలపోగుల స్వాములు
  • తెలంగాణ SGF రాష్ట్ర కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు

రంగారెడ్డి జిల్లా,అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సోలపోగుల స్వాములు మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకున్నారు. 69వ అఖిల భారత స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–17 బాల బాలికల జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీమతి ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ అఖిల భారతీయ అథ్లెటిక్స్ పోటీలు డిసెంబర్ 13 నుంచి 17 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నౌలో భవ్యంగా జరగనున్నాయి.

Dr. Solapogula Swamulu Selected as National Athletics Coach 1

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ…

“డాక్టర్ సోలపోగుల స్వాములు గారు పలుమార్లు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు కోచ్‌గా ఎంపిక కావడం మా పాఠశాలకే కాదు, మండలం–జిల్లా–తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. క్రీడా రంగంలో ఆయన సేవలు ప్రశంసనీయం” అని పేర్కొన్నారు.

- Advertisement -
Dr. Solapogula Swamulu Selected as National Athletics Coach12

అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సభ్యులు, క్రీడాభిమానులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల శిక్షణ, క్రీడల అభివృద్ధికి ఆయన చూపుతున్న నిబద్ధత వారికి ఆదర్శప్రాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సోలపోగుల స్వాములు మాట్లాడుతూ….

“జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మరోసారి కోచ్‌గా ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా విద్యార్థుల కృషి, సహచర ఉపాధ్యాయుల మద్దతు, అధికారుల ప్రోత్

Dr. Solapogula Swamulu Selected as National Athletics Coach
- Advertisement -
RELATED ARTICLES

Latest News