Homeవరంగల్‌Development | గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రథమ లక్ష్యం

Development | గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రథమ లక్ష్యం

  • సర్పంచ్ అభ్యర్థి బోడ భీక్యానాయక్.
  • ప్రచారంలో దూసుకుపోతున్న “ఉంగరం గుర్తు”

తండాలను అన్ని హంగులతో అభివృద్ధి చేయాలన్నదే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి బోడ భీక్యా నాయక్ అన్నారు. మంగళవారం పర్వతగిరి మండలం మాల్యా తండా గ్రామ పరిధిలోని గడ్డపార తండా, లాలు తండా, హార్జా తండా, పంచారాయి తండాలలో ఇంటింటి ప్రచారం ఊపు మీదుంది. ఇంటింటికి తిరుగుతూ ‘ఉంగరం’ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

Boda Bhikya Nayak Village Development Campaign

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని (అన్ని తండాలను) అభివృద్ధి చేయాలన్నదే తమ ముందున్న లక్ష్యమని, అందరిని కలుపుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు ఆశీర్వదించి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో బానోత్ భోజ్య, భానోతులాలు బానోతు నరసింహ, భారత్ వెంకన్న పోటీ చేస్తున్న వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News