Tuesday, March 3, 2026
Homeమహబూబ్‌నగర్‌Farewell | 36 ఏళ్ల విశిష్ట సేవకు వీడ్కోలు..

Farewell | 36 ఏళ్ల విశిష్ట సేవకు వీడ్కోలు..

  • జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి..

కానిస్టేబుల్ గా ప్రారంభమై ఎస్సైగా నిలిచి 36 ఏళ్ల విశిష్ట పోలీస్ సేవకు వీడ్కోలు పలుకుతున్నామని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పెబ్బేర్ ఎస్సై -2 జయరాం పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఎస్పీ పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపకాను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లో నిర్విరామంగా విధులు నిర్వహించిన జయరాం సేవలు పోలీస్ శాఖకు గర్వకారణమని కొనియాడారు.

విధినిర్వహణలో విధులు నిర్వహించి అనేకమంది ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న ఆయన పోలీస్ శాఖను వదిలి వెళ్తున్న ఆయన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని పేర్కొన్నారు. 36 ఏళ్లలో నీతి నిజాయితీ ప్రజా భద్రత లో అందరికీ ఆదర్శంగా నిలిచాడని అన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు పోలీసు కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పదవి విరమణ తరువాత జయరాం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పి వీరారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ నరేష్, రిజర్వ్ ఇనిస్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News