Friday, May 22, 2026
Homeఆరోగ్యంCranberry | మూత్రనాళ సమస్యలకు క్రాన్ బెర్రీలు..

Cranberry | మూత్రనాళ సమస్యలకు క్రాన్ బెర్రీలు..

  • ఇది సహజసిద్ధ పరిష్కారం..

చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేసే మూత్ర‌పిండ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మూత్ర‌నాళ ఇన్పెక్ష‌న్ కూడా ఒక‌టి. మందుల‌తోపాటు కొన్ని స‌హ‌జ ప‌రిష్కారాల ద్వారా కూడా ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ సమస్యలకు సహజ పరిష్కారంగా క్రాన్ బెర్రీలు ప‌నిచేస్తాయి. వీటి గురించి చాలా మంది వింటుంటారు. అయితే ఇవి భారతదేశానికి సంబంధించిన‌ పండ్లు కావు. అయినప్పటికీ మూత్రాశ‌య ఆరోగ్యానికి ఇవి ఉపయోగపడతాయా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అవసరం.

మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ బ్యాక్టీరియా, ముఖ్యంగా ఇ.కోలి మూత్రనాళంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ గా చెప్ప‌వ‌చ్చు. ఇది మూత్రాశయం లేదా తీవ్రమైన సందర్భాల్లో మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది. మూత్రం విస‌ర్జిస్తున్నప్పుడు మంట, తరచుగా మూత్రం రావడం, దుర్వాసన, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించినప్పటికీ, పురుషుల్లో కూడా ఇది సంభవిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News