Saturday, May 2, 2026
Homeకెరీర్ న్యూస్Congratulates | ఎస్ ఎస్ సి ఉత్తీర్ణులకు పవన్ శుభాకాంక్షలు..

Congratulates | ఎస్ ఎస్ సి ఉత్తీర్ణులకు పవన్ శుభాకాంక్షలు..

  • ఉత్తీర్ణత గణనీయంగా పెరగడంపై హర్షం..
  • విద్యాశాఖలో సంస్కరణల ఫలితమే ఇది అన్న పవన్..

ఏపీలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో చేపడుతున్న సంస్కరణల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు.

ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతం మేర మెరుగుపడిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని కొనియాడారు. మెగా పేరెంట్-టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News