Sunday, February 22, 2026
HomeజాతీయంPM Modi | కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన

PM Modi | కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ కర్ణాటక(Karnataka)లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉడుపి(Udipi)లోని శ్రీకృష్ణ మఠాన్ని (Sri Krishna Math) సందర్శించారు. అక్కడ జరిగిన లక్ష కంఠ భగవద్గీత పఠనం(Bhagavad Gita Reading)లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీ సైతం శ్లోకాలు (Sloka) చదివారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్ష మంది భక్తులు (Devotees), గాయకులు (Singers) పాల్గొని ఒకేసారి శ్లోకాల పఠనం చేశారు. తర్వాత.. శ్రీకృష్ణుడి దర్శనం, ప్రసాదాల స్వీకరణ ఉంటుంది. కిటికీ లేదా కంత నుంచి శ్రీకృష్ణుణ్ని దర్శించుకుంటారు. అంతకుముందు మధ్వసరోవరంలో తీర్థ ప్రోక్షణ నిర్వహిస్తారు. ఎనిమిది మఠాల అధిపతులు ప్రధానికి ఆశీర్వచనం అందిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News