Wednesday, December 10, 2025
EPAPER
Homeఅంతర్జాతీయంHeavy Rains | శ్రీలంకలో ఆఫీసులు, స్కూల్స్ మూసివేత

Heavy Rains | శ్రీలంకలో ఆఫీసులు, స్కూల్స్ మూసివేత

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీలంక(Srilanka)లో గవర్నమెంట్ ఆఫీసులు(Government Offices), స్కూల్స్ (Schools) మూసివేశారు. వరదలు(Floods), కొండచరియలు (Landslides) విరిగిపడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదాల్లో చనిపోయినవారి సంఖ్య 56కు పెరిగింది. మరింత ప్రాణనష్టం జరక్కుండా నివారించేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు బంద్(Roads Bandh) చేశారు. ప్రయాణికుల రైళ్లను నిలిపివేశారు. రహదారులపైకి, రైల్వే ట్రాక్‌ల మీదికి రాళ్లు, మట్టి, చెట్లు కొట్టుకొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో రైలు పట్టాలు నీట మునిగాయి. దేశం మొత్తమ్మీద 600కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. నదులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News