కరీంనగర్ కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ప్రారంభానికి ముందు వ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత “భారతరత్న” డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలో చాలా గొప్పనైనదని ఇతర దేశాలకు ఆదర్శనీయమని భారత రాజ్యాంగంలోని విషయాలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తాయని ప్రజలందరికీ కనీస అవసరాలను కల్పించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుందని వారు చెప్పారు.
ప్రభుత్వం మరియు ప్రభుత్వం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను రాజ్యాంగంలో చాలా చక్కగా తెలియపరచడం జరిగినదని వాటన్నిటిని కూడా ప్రభుత్వాలు వివిధ సందర్భాలలో తప్పనిసరిగా అమలుపరిచి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా చాలా ఘనంగా సంవిధాన్ దినోత్సవంగా నేడు జరుపుకుంటారని ఇదే రోజున జాతీయ చట్ట దినోత్సవం కూడా జరుపుకుంటారని వారు చెప్పారు రాజ్యాంగాన్ని దత్తత తీసుకున్న నేడు భారత రాజ్యాంగ విలువలను ప్రజలకు తెలియపరుస్తామని, ప్రధానంగా రాజ్యాంగం ప్రాధాన్యత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ ఆశయాల గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుందని రాజ్యాంగం ప్రాధాన్యత ఆశయాలను గురించి చక్కగా తెలియపరచడం జరుగుతుందని వారు అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేద వర్గాలకు ఎటువంటి హాని జరగకుండా వారి సంక్షేమమే పరమావధిగా భావించి ప్రత్యేకమైన ప్రణాళికలను మరియు విషయాలను రాజ్యాంగంలో పొందుపరచాలని పూర్తి చేశారు.
అంబేద్కర్ గారు విశిష్ట సేవలు అందించాలని రాజ్యాంగ కమిటీ అధ్యక్షునిగా పనిచేసిన వారు ప్రజల శ్రేయస్కై అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి లోబడి కార్యక్రమాలను చేపట్టి సంక్షేమానికి పెద్దపీట వేయాలని సూచించారు.
ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని కోరారు వేడుకల సందర్భంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి “రాజ్యాంగం ఒక గొప్ప మార్గదర్శకం” “రాజ్యాంగ సూత్రాలు అభివృద్ధికి బాటలు”” నాటికలు ఆలోచింపచేసాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరి విద్యార్థులు పాల్గొన్నారు.
