Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిWorship | ఉసిరి చెట్టు ప్రాముఖ్యతని చాటిన జర్నలిస్టులు.

Worship | ఉసిరి చెట్టు ప్రాముఖ్యతని చాటిన జర్నలిస్టులు.

మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మనం పూజించే దేవుళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన దైవం పరమశివుడు. ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన నెల కార్తీక మాసం.ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే కైలాసంలో ఉన్న సాక్షాత్తు ఆ పరమశివుని పూజించినట్టు హిందువులు భావిస్తారు. వివరాల్లోకి వెళితే నందిగామ జర్నలిస్టులు, మండల కేంద్రానికి చెందిన శివాజీ యూత్ సభ్యులు బుధవారం కార్తీక మాస ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేసి,ధ్యానిస్తే కన్న తల్లిదండ్రులకు సేవ చేసినట్టే అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమం ద్వారా ఉసిరి చెట్టుకు దానితో మనుషులకు ఉండే అనుబంధాలను తెలియజేశారు.

ఆరోగ్యానికి ఉసిరి మంచి ఆమ్లాన్ని అందిస్తూ, సకల రోగ నివారిణిగా పని చేస్తుందన్నారు.ఉసిరిలోని ఔషధ గుణాలను ప్రజలు తెలుసుకోవాలని, భవిష్యత్తులో అందరికి ఉపయోగపడుతుందని సూచించారు. హిందూ సనాతన ధర్మం బతికుండాలంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను ఉత్తేజపరుస్తూ, హిందు సనాతనాధర్మం గురించి తెలియజేస్తూ, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు దార యాదయ్య,వజ్ర లింగం,శ్రీహరి గౌడ్,రవి గౌడ్, సంతోష్ కుమార్,రమేష్ కన్నా,వెంకటేష్ గౌడ్,చెన్నగళ్ల సందీప్,సురేష్ గౌడ్,మధు,ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News