Monday, February 23, 2026
Homeవరంగల్‌Awareness | రైతులు దళారుల వద్ద మోసపోవద్దు

Awareness | రైతులు దళారుల వద్ద మోసపోవద్దు

రైతులు పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ సూచించారు. బుధవారం మండలంలోని నారక్కపేట, రాంపూర్, మేడపల్లి గ్రామాల్లో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాలతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇఫ్తార్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జ్యోతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుషోత్తం సురేష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్యాల ఉపేందర్ రెడ్డి, జంగిలి మోహన్, శ్రీపతి సుమన్, వంగర వెంకన్న, దుద్యాల సంపత్ రావు, వడ్లూరి రమేష్, ఏపీఎం సుధాకర్ అధికారులు రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News