ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు (Ministers) ఉన్నా అభివృద్ధి (Development) మాత్రం సున్నా(Zero) అని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కవిత విమర్శించారు. జాగృతి జనం బాట (Janam Baata) కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయని చెప్పారు. సత్తుపల్లి మండలం యాతలకుంటలో జరుగుతున్న సీతారామ ఎత్తిపోతల పథకం (Sitarama Lift Irrigation Scheme) 9వ ప్యాకేజీలోని టన్నెల్ (Tunnel) నిర్మాణ పనులను పరిశీలించారు.
టేకులపల్లి మోడల్ స్కూల్(Tekulapalli Model School)లో దయనీయ పరిస్థితులు ఉన్నాయని, హాస్టల్ భవనం ప్రమాదకరంగా మారి విద్యార్థులకు భద్రతలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల కిందట భోజనంలో బొద్దింకలు, పురుగులు వచ్చి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో దీన్నిబట్టి తెలుస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో పర్యటనకు వెళ్లినా అక్కడి హాస్టల్స్, స్కూళ్లలో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి సంక్షేమ హాస్టల్స్‌లో సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
