Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డికాంగ్రెస్ పార్టీదే గెలుపు అని జూబ్లీహిల్స్ ప్రచారంలోనే చెప్పా

కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని జూబ్లీహిల్స్ ప్రచారంలోనే చెప్పా

  • తెలంగాణలో జరిగే ప్రతి ఎలక్షన్స్ లో మేమే గెలుస్తాం..
  • కేటీఆర్ ఎన్ని కట్టుకథలు చెప్పినా, జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మలేదు : మైనంపల్లి హనుమంతరావు

జూబ్లీహిల్స్ ప్రజలు, రాష్ట్ర శ్రేయస్సు కోసం, తమకోసం 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కె పట్టం కట్టారు అని, ఫామ్ హౌస్ లో పడుకున్న కెసిఆర్ ను వద్దని తిరస్కరించారని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాలను ఆదరిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను, కార్యకర్తలను గుర్తించుకొని వారికి సముచిత న్యాయం చేస్తున్నారని అన్నారు. ఇటీవల మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి కానీ, అటు పార్టీకి సేవలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న నవీన్ యాదవ్ కు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఇవ్వడమే నిదర్శనం అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షం అని , ఎలక్షన్స్ లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. జూబ్లీహిల్స్ లో గెలవడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసిన, ప్రజలు కేటీఆర్ ను గానీ, బిఆర్ఎస్ పార్టీని నమ్మలేదని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ కు స్పష్టమైన మెజారిటని ఇచ్చి గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు, నవీన్ యాదవ్ గెలుపుకు పనిచేసిన ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తకు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మైనంపల్లి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News