మల్కాజిగిరి నియోజకవర్గం,ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ ఉప్పలమ్మ గుడి దగ్గర 11 లక్షలతో కొనసాగుతున్న యు జి డి, 10 లక్షలతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను బుధవారం స్థానిక కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, కాలనీవాసులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత కూడిన పనులను సకాలంలో పూర్తి చేయాలని గుత్తేదారుని ఆదేశించారు.కార్యక్రమంలో బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, కిషోర్, కాలనీవాసులు అశోక్ రాందాస్, భాస్కర్, ప్రభాకర్, ప్రమీల, శ్యాం కుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
