తాను తిరిగి బంగ్లాదేశ్(Bangladesh)కి రావాలంటే ప్రజాస్వామ్యం(Democracy)తో కూడిన వాతావరణం ఉండాలని ఆ దేశ మాజీ ప్రధాని (Ex PM) షేక్ హసీనా కండిషన్ పెట్టారు. అవామీ లీగ్ పార్టీ(Awami League Party)పై నిషేధం ఎత్తివేయాలని, ఎన్నికల(Election)ను స్వేచ్ఛాయుతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. పీటీఐ(PTI)కి ఇ-మెయిల్(E-Mail)లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. యూనస్ సర్కారు (Yunus Government) తీవ్రవాదులకు అధికారమిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాధినేత తన మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారని, ఇండియా(India)తో సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసుల విచారణకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(International Criminal Court)లో హాజరవుతానని వెల్లడించారు. యూనస్ ప్రభుత్వం తనను రాజకీయంగా బలహీనపరచడానికి కుట్ర పన్నుతున్నారని షేక్ హసీనా ధ్వజమెత్తారు.
Sheikh Hasina | బంగ్లాదేశ్‌కి తిరిగొచ్చేందుకు కండిషన్
By Aadab Desk
- Advertisement -
Previous article

