Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డికార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో ఓల్డ్ నేరేడ్మెట్ కృపా కాంప్లెక్స్ పర్యటన

కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో ఓల్డ్ నేరేడ్మెట్ కృపా కాంప్లెక్స్ పర్యటన

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మంగళవారం, మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని కృపా కాంప్లెక్స్, ఓల్డ్ నేరెడీమేట్ లలో జిహెచ్ఎంసి హెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఓల్డ్ నేరేడ్మెట్ లో దాదాపు 14 లక్షల రూపాయలతో నూతనంగా మంజూరు చేసిన సిసి రోడ్డు పనులను మొదలు పెట్టాల్సిందిగా అధికారులను కోరారు. దాంతోపాటు భూగర్భ డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు కార్పొరేటర్ శ్రవణ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే డ్రైనేజీ పైప్ లైన్ ని వేయాలని వాటర్ వర్క్స్ అధికారులలో ఆదేశించడం జరిగినది.అనంతరం కృపా కాంప్లెక్స్ బ్లాక్ నైన్ వద్ద సివిరేజీ సమస్యను వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించి దానికి కావలసిన పనులు చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగినది.

కాలనీలలో మళ్లీ మళ్ళీ తోవ్వాల్సిన అవసరం లేకుండా వాటర్ వర్క్స్ అధికారులు సహకరించాలని జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ ను కోరారు. స్పందించిన వాటర్ వర్క్స్ అధికారులు కృపా కాంప్లెక్స్ , ఓల్డ్ నేరేడ్మెట్లలో సివరేజ్ పైప్ లైన్ ని వెంటనే వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని కార్పొరేటర్ తెలియజేశారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్, డి.ఈ మహేష్ , ఏఈ నవీన్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ , వాటర్ వర్క్స్ డి.జి.ఎం రాజు, మేనేజర్ మల్లికార్జున్, సూపర్వైజర్ నాగార్జున, బిజెపి నాయకులు మురళి గౌడ్, నందు యాదవ్ శేఖర్,సంజీవ, రవి, స్పైడర్ శ్రీనివాస్, శ్రీదేవి, మాధవ్ యాదవ్, అశోక్,రాజు, శర్మ, రాజీవ్,శ్రీశైలం, ప్రభాకర్, రామ్ చందర్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News