Homeనల్లగొండInspiration | మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి..

Inspiration | మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి..

  • దేశ విద్యారంగ పురోభివృద్ధికి ఆయన కృషి చిరస్మరణీయం..
  • జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఘన నివాళి..
  • జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

​నల్గొండ: ​భారత స్వాతంత్య్ర సమరయోధులు, బహుభాషా కోవిదులు, దేశ విద్యాభివృద్ధికి మార్గదర్శకులు అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Abul Kalam Azad) స్ఫూర్తిని యువత అందిపుచ్చుకుని ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), పిలుపునిచ్చారు.

​భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా, మైనార్టీల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మరియు జాతీయ విద్యాదినోత్సవాన్ని(National Education Day) పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

- Advertisement -
maulana abul kalam azad inspiration national education day ila tripathi 1 1

ఆజాద్ కృషిని గుర్తు చేసుకున్న కలెక్టర్..

మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ గారి పాత్ర చాలా కీలకమైనదని, ఆయన కేవలం సమరయోధుడే కాకుండా, బహుభాషా కోవిదుడని, ఆయన కృషి భావితరాలకు ఆదర్శప్రాయమని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పనిచేసి, దేశంలో విద్యారంగ పురోభివృద్ధికి, మైనార్టీల సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు.నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు ఆయన చూపిన విద్యా మార్గాన్ని అనుసరించి, దేశ పురోగతిలో పాలుపంచుకోవాలని ఆమె సూచించారు. జిల్లా అధికారులు, సిబ్బంది, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News