Wednesday, February 11, 2026
Homeనిజామాబాద్‌Volleyball | వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

Volleyball | వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

బాన్సువాడ పట్టణ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం(Professor Jayashankar Mini Stadium)లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్ మహిళల, పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ (Tournament)-2025 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే (Banswada Mla) పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేష్ గౌడ్, బాన్సువాడ MEO నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాకవి అందెశ్రీ (Andesri) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని క్రీడా ప్రాంగణంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News