జూబ్లీహిల్స్ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో నవీన్ యాదవ్‌కి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. యూసుఫ్‌గూడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. నవీన్ యాదవ్ విద్యావంతుడు, యువకుడు, స్థానికుడు, అన్ని వర్గాల సమస్యలపై అవగాహన ఉన్నవాడు అని చెప్పారు. సినీ కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్నవాడని, వాటి పరిష్కారానికి అండగా ఉండే వ్యక్తి అని తెలిపారు.
పొన్నం ప్రభాకర్ ఇంకా ఏమన్నారంటే..
ఉన్నత విద్యావంతుడు నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు నిండుగా ఆశీర్వదిస్తున్నారు. బీసీ(BC)లకు 42 శాతం రిజర్వేషన్లు (Reservations) అమలుచేస్తూ చట్టం చేసిన సందర్భంలో బలహీన వర్గాల బిడ్డకు జూబ్లీహిల్స్‌లో టికెట్ ఇచ్చాం. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసి చూపిస్తాం. Brs అసహనంతో మాట్లాడుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పార్లమెంట్ నియోజవర్గంలో జూబ్లీహిల్స్ ఉంది. బీజేపీ(BJP)కి 10 వేల ఓట్లు కూడా దాటవు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ లాగా వ్యవహరిస్తున్నారు. మా అభ్యర్థి మీద సంబంధంలేని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. Brs, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. కంటోన్మెంట్‌లో గెలిచినట్లే జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బలహీన వర్గాల బిడ్డ నవీన్ యాదవ్‌ను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి.
