Wednesday, January 14, 2026
EPAPER
HomeఫోటోలుRaghavendraRao | ‘ఇరువురు భామల కౌగిలిలో’ ప్రారంభం

RaghavendraRao | ‘ఇరువురు భామల కౌగిలిలో’ ప్రారంభం

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్‌ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్‌ శ్రీనివాస్ గౌడ్‌ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో ప్రారంభమైన చిత్రం ‘ఇరువురు భామల కౌగిలిలో’(Iruvuru Bhamala Kougililo).

పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ (committee kurrollu) ఫేమ్‌ త్రినాథ్ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు నటించనున్నారు.

- Advertisement -

చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోహీరోయిన్లపై నిహారికా కొణిదెల (Niharika Konidela) క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్‌(B.Gopal) కెమెరా స్విఛాన్‌ చేశారు. ఫస్ట్‌ షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి(Kodanda Rami Reddy)తోపాటు నిర్మాత, కెమెరామెన్‌ ఎస్‌.గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ మూవీ ఓపెనింగ్‌కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యధు వంశీతోపాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. దర్శకుడు మల్లిక్‌రామ్, వర ముళ్లపూడి తదితరులు పాల్గొన్నారు.

సంగీతం శీను భీట్స్, డిఓపి శశాంక్‌ శ్రీరామ్, మాటలు శ్రీధర్‌ సీపాన, ఎడిటర్‌ రాఘవేంద్ర వర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌ సౌజన్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సాయిరామ్‌ దేవర్ల, ప్రొడక్షన్‌ డిజైనర్‌ షర్మిలా కొప్పిశెట్టి, కాస్టూమ్స్‌ ప్రణతి, పి.ఆర్‌.ఓ శివ మల్లాల, నిర్మాత శ్రీనివాస్ గౌడ్, దర్శకత్వం అచ్యుత్‌ చౌదరి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News