Homeహైదరాబాద్‌భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణే లక్ష్యం

భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణే లక్ష్యం

  • మంగళంపల్లి సత్యనారాయణ ఫౌండేషన్ ఆవిర్భావం

భారతీయ సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు కృషి చేయాలనే లక్ష్యంతో మంగళంపల్లి సత్యనారాయణ ఫౌండేషన్ (ఎం ఎస్ ఎన్ ఫౌండేషన్) ఏర్పాటైనట్లు ఆ సంస్థ ఛైర్మన్ మంగళంపల్లి సత్యనారాయణ, కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ మెంబర్ డా. ఎస్పి భారతి తెలిపారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, యోగా, వేదాంతం, సాహిత్యం, సంగీతం, నృత్యం తదితర కళారూపాల పరిరక్షణ, ప్రోత్సాహానికి ఫౌండేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు.

Mangalampalli Satyanarayana Foundation Launch Hyderabad

ఫౌండేషన్ తొలి కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డులు (2024, 2025) అందుకున్న విశిష్ట కళాకారులను సన్మానించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జూలై 6న పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కట్టుబడి పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సంస్థలతో సమన్వయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. చారిత్రక వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్య సంప్రదాయాల పరిరక్షణకు ఫౌండేషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం కల్పించి విజయవంతం చేయాలని మీడియా ప్రతినిధులను ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News