- ముక్కోటి దేవతల నిలయం గో మాత ఆలయ అర్చకులు సాయి శర్మ
- గోరక్షణ ప్రతి హిందువు బాధ్యత విహెచ్పి జిల్లా సహా కార్యదర్శి మల్యాల రవి
నర్సంపేట విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నర్సంపేట లోని శివాంజనేయ స్వామి దేవాలయం లో గోమాత పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు సాయి శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి.. గో సంస్కృతి యొక్క స్వరూపము. వివిధ పండుగలలో, గోవులను స్మరించుకుంటాము, పూజిస్తాము, గోవుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తాము హిందువులందరం గో మాత ను ముక్కోటి దేవతల నిలయం గా పూజిస్తాము అని తెలియచేసారు.
విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి మల్యాల రవి మాట్లాడుతూ గో రక్షణ ప్రతి హిందువు బాధ్యత గోవులో చాలా సానుకూల శక్తి ఉందని శాస్త్రీయ పరిశోధనలో తేలింది.ఆవు వెనుక వెన్నెముకలో ఉండే సూర్యకేతు నాడి హానికరమైన రేడియేషన్‌ను అడ్డుకోవడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతుంది. ఈ సూర్యకేతువు నాడి సర్వ రోగాలను నశింపజేస్తుంది, సర్వ విషనాశకము.ఆవు పేడ న్యూక్లియర్ రేడియేషన్‌ను నాశనం చేస్తుంది.
ఆవు పేడ ఆల్ఫా, బీటా, గామా కిరణాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సూర్యకేతువు నాడి సూర్యకిరణాల నుండి వెలువడే శక్తిని గ్రహిస్తుంది, అది బంగారంగా ఉత్పత్తి అవుతుంది. ఆ బంగారం నేరుగా ఆవు పాలు, మూత్రంలో చేరుతుంది. అందుకే ఆవు పాలు, మూత్రం లేత పసుపు రంగులో ఉంటాయి. ఈ పసుపు రంగు కెరోటిన్ మూలకం వల్ల వస్తుంది, ఇది క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులను నివారిస్తుంది.
ఈ బంగారం ఆవు పేడ ద్వారా పొలాలకు వెళ్తుంది అందుకే ‘గోమయే వసతే లక్ష్మీః’ అంటారు. ఆవు పేడను కాల్చడం వల్ల క్రిములు, దోమలు నశిస్తాయి ఆవు నెయ్యితో హవాన్‌పై రష్యాలో శాస్త్రీయ ప్రయోగాలు జరిగాయి. ఒక తులం (10 గ్రాములు) ఆవు నెయ్యితో యజ్ఞం చేయడం ద్వారా ఒక టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది గోవు ఆధారిత వ్యవసాయం (సేంద్రీయ వ్యవసాయం) – ఉపాధి యోగ్యమైనది, ఆర్థికంగా ఫలోపేతం చేసేది, ఆరోగ్యాన్ని ప్రోత్సహించేది, పర్యావరణ పరిరక్షణి ఒక గ్రాము దేశవాళి ఆవు పేడలో కనీసం 300 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది.
ఈ బాక్టీరియం పొలాల్లోని అనేక సూక్ష్మక్రిములను చంపడం ద్వారా నేలను సారవంతం చేస్తుంది. భారతీయ ఆవు పేడతో తయారైన ఎరువు వ్యవసాయానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరు గో రక్షణ గో సేవ చేస్తూ మన సంస్కృతిని మన మనుగడని కాపడడం కోసం పాటు పడాలని గో హత్య నిర్ములనకై ప్రతి ఒక్కరు పని చేయాలనీ తెలిపారు
ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ నర్సంపేట అధ్యక్షులు చోల్లేటి జగదీశ్వర్, కార్యదర్శి వేల్పుల శ్రీధర్, ఉపాధ్యక్షులు వీరన్న, సహా కార్యదర్శి రాజేందర్, సేవ ప్రముఖ్ రవి, బజరంగ్ దళ్ కన్వినర్ చరణ్, రాము, ఐలోని, రాందాస్, రాంచంధర్, శ్రవణ్, రవితేజ, విశ్వ, సాయిరాజ్, తదితర కార్యకర్తలు గో సేవకులు గో రక్షకులు ఈ పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు.
