మల్కాజిగిరి, నవంబర్ 7 (ఆదాబ్ హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపు కోసం మల్కాజిగిరి (Malkajgiri) కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao) ఆదేశాల మేరకు శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో.. మల్కాజిగిరి బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు వైనాల ప్రవీణ్, ఇతర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
- Advertisement -
