Tuesday, March 3, 2026
Homeవరంగల్‌Warning | మైనర్లకు వాహనాన్ని ఇస్తే ఓనర్ తో పాటు జైలుకే

Warning | మైనర్లకు వాహనాన్ని ఇస్తే ఓనర్ తో పాటు జైలుకే

  • నర్సంపేట పట్టణ సిఐ రఘుపతి రెడ్డి 

నర్సంపేట: మైనర్(minor) బాలురకు ద్విచక్ర వాహనాన్ని ఇస్తే బండి యజమానితో పాటు మైనర్లు జైలుకు వెళ్తారని నర్సంపేట పట్టణ సిఐ రఘుపతి రెడ్డి(CI Raghupathi Reddy) హెచ్చరించారు. ఈ సందర్భంగా నర్సంపేట(Narsampet) పట్టణంలోని బస్టాండు ప్రాంగణంలో నెంబర్ లేకుండా తిరుగుతున్న 11 వాహనాలను సీజ్(vehicles seize) చేసి నర్సంపేట పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులను హెచ్చరిస్తూ(warning) బండి నడుపుతున్న ప్రతి వ్యక్తి లైసెన్స్(license) కలిగి ఉండాలని హెల్మెట్ ధరించి ఉండాలని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఈ కరం క్రమంలో పట్టణ సిఐతో పాటు ఎస్ఐ అరుణ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News