HomeరాజకీయంKamma | నవీన్ యాదవ్ వెంటే కమ్మ సంఘాలు

Kamma | నవీన్ యాదవ్ వెంటే కమ్మ సంఘాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్‌(Naveen Yadav)కి కమ్మ సంఘాలు (Kamma Associations) సంపూర్ణ మద్దతు (Complete Support) తెలిపాయి. యూసుఫ్‌గూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ఈ మీటింగ్‌లో తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమైక్య అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ రావు పాల్గొన్నారు.

WhatsApp Image 2025 11 06 at 15.44.43

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ(Telangana)లో 60 కమ్మ సంఘాలు ఉన్నాయని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ‘నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి. చాలా సంవత్సరాలుగా పేదలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 40 వేల కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ చట్టం చేసింది. దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి నవీన్ యాదవ్‌ను గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

WhatsApp Image 2025 11 06 at 15.44.44
- Advertisement -
RELATED ARTICLES

Latest News