- గ్రామ పంచాయతీ సిబ్బందికి పండ్లు, దుస్తులు పంపిణీ
ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు వల్లిగారి సాయికుమార్ నవంబర్ 2న తన పుట్టిన రోజును పురస్కరించుకొని పలు సేవాకార్యాక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం హత్నూర మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లకు పండ్లు దుస్తులు కానుకలుగా అందజేశారు. ప్రతి నిత్యం పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం పనులు చేస్తున్న కార్మికులు, ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు తన పుట్టినరోజు సందర్భంగా చిరు కానుకగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు సాయికుమార్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -
