- చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి
అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సి ఆర్ జి కేర్ ఆధ్వర్యంలో సుఖవ్యాధులు (STIs) మరియు వాటి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుఖవ్యాధులపై ప్రజలు అపోహలకు లోనుకాకుండా, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి తగిన వైద్య పరీక్షలు, చికిత్స పొందాలని సూచించారు.
సి ఆర్ జి కేర్ ప్రతినిధులు సుఖవ్యాధులు వ్యాప్తి చెందే విధానాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన ఆరోగ్య అలవాట్లు, సమయానికి వైద్య సలహా పొందడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల్లో సుఖవ్యాధులపై అవగాహన పెంపొందించడం, అపోహలను తొలగించడం, వ్యాధుల నివారణకు అవసరమైన జాగ్రత్తలను తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సి ఆర్ జి కేర్ ప్రతినిధులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
