మునుగోడు ప్రాంతానికి విశేష సేవలందిస్తున్న ఈ.ఎల్.వి. భాస్కర్ జన్మదిన వేడుకలను మర్రిగూడ మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, ఈ.ఎల్.వి. బృందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, కలర్ బాక్సులు పంపిణీ చేయడంతో పాటు, పాఠశాలల్లో ఉదయం ప్రార్థనల కోసం బ్లూటూత్ స్పీకర్, మైక్ సెట్‌ను అందజేశారు.

స్థానిక ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే, గ్రామాల్లో పనిచేస్తున్న ఈ.ఎల్.వి. బృందం సభ్యులకు సైకిళ్లు, హెల్మెట్లను బహూకరించారు. ఈ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఓపికతో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ.ఎల్.వి. బృంద సభ్యులు అయితగోని నర్సింహ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
