నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా
తుఫాన్ (Cyclone) ప్రభావంతో పంట నష్టం (Crop Loss) జరిగిన పొలాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Dy CM) పరిశీలించారు (Pawan Kalyan inspects). కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఆయన గురువారం పర్యటించి నేలకొరిగిన వరి పైరును ప్రత్యక్షంగా చూశారు. రైతన్న(Farmers)లను పరామర్శించి.. ప్రభుత్వం (Government) ఆదుకుంటుందంటూ వారికి భరోసా (Bharosa) ఇచ్చారు.

పంట చేతికొచ్చే సమయంలో తుపాను తమను ముంచేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా బాగా నష్టపోయామని, ఎకరానికి రూ.30 వేలు ఖర్చు అయ్యిందని తెలిపారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వపరంగా రైతులను ఆదుకుంటామని, అధైర్య పడవద్దని పవన్ కళ్యాణ్ రైతులకు ధైర్యం చెప్పారు.



