నవంబర్ 1, 2 తేదీల్లో హైటెక్ సిటీలోని నోవాటెల్ HICCలో
సినిమాటికా ఎక్స్‌పో 2025ని నవంబర్ 1, 2 తేదీల్లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. సినిమా అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసేది సాంకేతికత, సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలు. ఆ దిశలో సినిమాటికా ఎక్స్‌పో.. సినిమా భవిష్యత్తుకి వేదికగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్ HICCలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ సినిమా దిశగా మన అడుగులు వేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఈ ఎక్స్‌పోను ‘సినిక క్రియేటర్స్ కౌన్సిల్’ స్వచ్చంద సంస్థ, తెలంగాణ ప్రభుత్వం, IndiaJoy సహకారంతో నిర్వహిస్తున్నారు.
ఈ 3వ ఎడిషన్‌లో ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్ ప్రొడక్షన్, AI ఫిల్మ్‌మేకింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై మాస్టర్ క్లాసులు, వర్క్‌షాప్‌లు, నెట్‌వర్కింగ్ సెషన్లు జరగనున్నాయి. ఈ సంవత్సరం థీమ్ “From Hollywood to Hyderabad: Building the Global Gateway of Cinema.” ఇది కేవలం నినాదం కాదు. భారతీయ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టే దృక్పథం.
2023లో ఇండియాలో తొలిసారి ఫిల్మ్‌టెక్ ఎక్స్‌పోగా “సినిమాటికా” గుర్తింపు పొందింది. 2024లో వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ టెక్నాలజీని పరిచయం చేసి కొత్త దిశలో అడుగేసింది. 2025లో సీఎం రేవంత్ పిలుపు మేరకు “హాలీవుడ్ టు హైదరాబాద్” కాన్సెప్ట్‌తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే కొత్త మైలురాయిగా ఈ ఎడిషన్ నిలుస్తుంది. సినిమా, టెక్నాలజీ, ఆర్ట్, కల్చర్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారత సినిమా పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలవడం లక్ష్యం.
“Where Filmmaking Meets the Future” ఈ నినాదం కేవలం మాట కాదు. మన దిశను నిర్వచించే దారి. ఇది ఒక ఎక్స్‌పో కాదు. మన సినిమా భవిష్యత్తు కోసం మన సమిష్టి కృషి అవసరం. హైదరాబాద్ నుంచి హాలీవుడ్ దాకా మన సృజనాత్మకతకు గ్లోబల్ వేదికగా నిలిచే ఈ ప్రయాణంలో ప్రతి సినీ ప్రొఫెషనల్, ప్రతి టెక్నీషియన్ భాగస్వామి కావాలి.
