- తెలంగాణ దిశగా కదులుతున్న తుఫాను
- వాయుగుండంగా మారే అవకాశం
- ఆపై మరింత తీవ్ర ప్రభావం చూపే చాన్స్
- రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- భారీ వర్షాలకు తడిసి ముద్దైన పంటలు
- హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
- నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రెడ్ అలర్ట్
- పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్
- నల్లగొండ జిల్లాలో నీటమునిగిన గురుకులం
బంగాళా ఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో తెలంగాణాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మొంథా తుపాను తీరం దాటిందని.. కాకినాడకు సమీపంలోని నరసాపురం సమీపంలో తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం తీవ్ర తుపాను బలహీనపడిందని.. రానున్న కొన్ని గంటల్లో అది తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

భద్రాచలానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో.. ఖమ్మంకు 110 కిలోమీటర్ల దూరంలో ఈ మొంథా తుఫాన్ కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా రానున్న కొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా తీవ్ర హెచ్చరికలు చేసింది.

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్:
సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ.

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్:
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్:
కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఇప్పటికే మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై గట్టిగా ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక వరం గల్ జిల్లాలో రికార్డు స్థాయి పర్షపాతం నమోదైంది. పర్వతగిరిలో ఏకంగా 34.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. వరి ధాన్యం కోసి మార్కెట్ యార్డులకు తరలించగా.. భారీ వర్షాలకు తడిసి ముద్దైనట్లు రైతులు వాపోతున్నారు. ఇంకా పొలాల్లో కోయని వరి పంట అలాగే ఉందని అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.

హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
పలు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలోని బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. మొంథా తుఫాన్ ప్రభావంతో నగరం ముసురేసింది. పలుచోట్ల గట్టిగానే కురిసింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నగరం లో కురుస్తున్న వర్షం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తరచూ.. సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోల్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. డీప్ మ్యాన్హా హోల్స్ దగ్గర సీవరేజి సూపర్ వైజర్లు ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలు ఎలాంటి పరి స్థితుల్లోనూ మ్యాన్హాల్స్ మూతలను తెరవకూడదని అశోక్ రెడ్డి సూచించారు. ఎమర్జెన్సీ కోసం జలమండలి హెల్ప్ లైన్ 155313 కి కాల్ చేయాలని ఆయన కోరారు.
జంట జలాశ యాల గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండా లన్నారు. కాగా, మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా తెలంగా ణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నగరంలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడు తున్నాయి. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వర్షాలతో రోడ్లన్నీ చెరువు లను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లు తున్నాయి.
పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. మరికొన్ని ప్రాంతా ల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపో వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలి, ఖాజా గూడ, నానక్ రాం గూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీ నగర్, కవాడి గూడ, భోలక్ ప్పూర్, అంబర్పేట, కాచిగూడ, నల్ల కుంట, బర్కత్ పురా, బీఎన్రెడ్డినగర్, మీర్పేట్, బాలాపూర్, బడంగ్పేట్, మహే శ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్, జవహర్ నగర్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, దోమలగూడలో వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
