అవినీతి అధికారులు దొంగలతో కలిశారు. నీతిమంతులు నిజాయితీగా జారుకుంటున్నారు. వద్దురా నాయనా ఈ దొంగల మధ్య బాధ్యతలు. వీఆర్‌ఎస్ మంచిది. కొత్త బిక్షగాడు పొద్దు ఎరుగడు. ఈ అవినీతి పాలకులు కూడా పొద్దు ఎరుగని చంద్దంగా.. ఒక రోజుకు ఇంతా. ఒక గంటకు ఇంతా.. ఒక సంవత్సరానికి ఇంతా.. అని కుటుంబ సభ్యులకు వసూల్ బాధ్యతలు అప్పజెప్పారు. ఓటు ఏసిన జనాలు అన్ని గమనించగలరు. గమనిస్తూ ఉన్నారు. బిడ్డ ఒక దగ్గర, అల్లుడు ఒక దగ్గర, కొడుకు ఒక దగ్గర, తొబుట్టువులు ఒక దగ్గర, బామ్మర్ది ఒక దగ్గర, బావ ఒక దగ్గర.. ఇలా ప్రతి చోట వసూల్ దందా నడుస్తుంది. ఇది జనం ఎరిగిన సత్యం. వారికి ఎలాగు తెలుసు మేము మళ్ళీ గెలువం అని.
- సుధాకర్ తలారి
